మావోయిస్ట్ నేత అంజన్న అరెస్ట్ | Maoist arrested | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్ నేత అంజన్న అరెస్ట్

Feb 4 2016 3:39 PM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్ట్ నేత సున్నం బుజ్జి అలియాస్ అంజన్నను గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

చర్ల (ఖమ్మం జిల్లా) : మావోయిస్ట్ నేత సున్నం బుజ్జి అలియాస్ అంజన్నను గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఆర్‌పీఎఫ్, జిల్లా పోలీసులు పెద్దసిమిలేరు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. యాక్షన్ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్న అంజన్న పై వివిధ పోలీస్‌స్టేషన్లలో 41 కేసులున్నట్లు చెప్పారు. ఇతనితోపాటు గుర్రం రాజు,కల్లూరి సమ్మయ్య ,కె.భుజంగరావు అనే ముగ్గురు మావోయిస్ట్ సానుభూతిపరులను కూడా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement