చెర్లలో మావోయిస్టు అరెస్ట్ | Maoist arrested | Sakshi
Sakshi News home page

చెర్లలో మావోయిస్టు అరెస్ట్

Aug 22 2015 3:04 PM | Updated on Oct 9 2018 2:47 PM

మావోయిస్టులకు మందులు సరఫరా చేస్తున్న ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

చెర్ల (ఖమ్మం) : మావోయిస్టులకు మందులు సరఫరా చేస్తున్న ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చెర్ల మండలంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోరుకొండ గ్రామానికి చెందిన పుడుం దేవా(20) అనే యువకుడు గత కొంతకాలంగా పామేడు దళంలో సభ్యునిగా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో అతను ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన కారం హనుమంతు(19), పామేడు గ్రామానికి చెందిన సతీష్(28) అనే ఇద్దరు కొరియర్లతో కలిసి మందులు తీసుకురావడానికి చెర్లకు వచ్చి వెళ్తున్న సమయంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. వారి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement