మ్యాన్‌కైండ్‌ ఫార్మా రూ 51 కోట్ల విరాళం

Mankind Pharma Donating Rs 51 Crore To CM Relief Fund - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఈ మహమ్మారిపై పోరాటానికి మ్యాన్‌కైండ్‌ పార్మా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 51 కోట్లు విరాళంగా ప్రకటించింది. పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మందులను విరాళంగా ఇవ్వనుంది. కరోనాపై పోరాటంలో తెలంగాణా, ఏపీ, కేరళ, మహారాష్ట్ర, యూపీ, ఉత్తరాఖండ్‌, బిహార్‌, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాలతో కలిసిపనిచేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ విపత్తు అత్యంత సవాల్‌తో కూడుకున్నదని, వైరస్‌ బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టడంతో పాటు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందచేస్తామని మ్యాన్‌కైండ్‌ ఫార్మా చైర్మన్‌ ఆర్‌సీ జునేజా పేర్కొన్నారు. వెంటిలేటర్ల సరఫరా, వైరస్‌తో పోరాడుతున్న వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన పరికరాల కోసం తాము ఈ నిధిని వెచ్చిస్తామని చెప్పారు. తమ ఆస్పత్రులను వైరస్‌ బాధితులకు చికిత్స అందించేలా దీటుగా మలుస్తామని పేర్కొన్నారు.

చదవండి :క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top