ఉద్యోగినిపై దాడికి పాల్పడిన యజమాని అరెస్టు | Managing Director attacks Computer Operator | Sakshi
Sakshi News home page

ఉద్యోగినిపై దాడికి పాల్పడిన యజమాని అరెస్టు

Aug 29 2015 7:51 PM | Updated on Sep 3 2017 8:21 AM

ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఓ కంపెనీ యజమానిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

గచ్చిబౌలి (హైదరాబాద్) : ఉద్యోగినిపై దాడికి పాల్పడిన ఓ కంపెనీ యజమానిని అరెస్ట్ చేసిన సంఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాబ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఓ యువతి(22) గచ్చిబౌలి టెలికాంనగర్‌లో గల బ్రిక్‌మోర్ ఇన్‌ఫ్రాలో మూడు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. కాగా బుధవారం కంపెనీ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి క్యాబిన్‌లోకి వెళ్లి తనకు పెళ్లి నిశ్చయమైందని, ఉద్యోగం మానేస్తానని చెప్పింది.

వెంటనే ఎండీ శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహంతో.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతారంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమెను కొట్టి బలవంతంగా 'కంపెనీ ఇచ్చిన జీతం తిరిగి ఇచ్చేస్తాను' అని రాయించుకున్నాడు. భయంతో ఇంటికి వెళ్లిన యువతి కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలుపగా వారు శుక్రవారం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement