మాట వినలేదని తమ్ముడిని చంపిన అన్న | Man killed Brother | Sakshi
Sakshi News home page

మాట వినలేదని తమ్ముడిని చంపిన అన్న

Jan 14 2016 2:52 PM | Updated on Jul 30 2018 8:29 PM

చెప్పిన మాట వినలేదనే కోపంతో ఓ అన్న తమ్ముడిని చంపేశాడు. ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

లోకేశ్వరం (ఆదిలాబాద్) : చెప్పిన మాట వినలేదనే కోపంతో ఓ అన్న.. తమ్ముడి చావుకు కారణమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవిదాస్ బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. తమ్ముడు ముత్యం(35)కు ఓ పని పురమాయించాడు. నిరాకరించటంతో అతడి ఛాతీపై కాలితో బలంగా తన్నాడు. దీంతో ముత్యం  అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రాములు గురువారం ఉదయం పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement