పీకలదాకా తాగి బతికున్న కోడిని పీక్కుతిన్నాడు

Man eats Hen alive after getting drunk in mahabubabad district - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మద్యం తాగిన మత్తులో కొంతమంది దారుణాలకు తెగబడుతుంటారు. ఇంకొంతమంది జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కేసముద్రంలో ఓ యువకుడు మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు పీకలదాకా మద్యం తాగారు. పక్కనే చికెన్ షాపులో ఓ కోడిని కొనుక్కుని  ఇంటికి బయల్దేరారు. మద్యం అతిగా సేవించడంతో సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్న ఇద్దరు యువకులు ఆర్వోబీ రోడ్డు సమీపంలో పడిపోయారు.

ఓ యువకుడు పూర్తిగా స్రృహ కోల్పోయాడు. మరో యువకుడు మాత్రం చేతిలో ఉన్న కోడి మెడ కొరికేసి, బతికున్న దాన్నే కొరుక్కుతిన్నాడు. ఈ తతంగాన్నంతా రోడ్డున వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. వీడియో చూపిన వారంతా వీడెంత తాగాడురా.. బాబూ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సదరు యువకుల వివరాలు తెలియరాలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top