విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి | man dies of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

May 28 2015 4:44 PM | Updated on Apr 3 2019 8:07 PM

విద్యుత్ షాక్ కు మరో వ్యక్తి బలయ్యాడు.

మహబూబ్‌నగర్: విద్యుత్ షాక్ కు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధరపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు..  గ్రామానికి చెందిన గట్టుపల్లి అంజయ్య మోటరు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం తోటలో మోటారు రిపేరి చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రాఘవేందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement