ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే.. | Man Committed Suicide | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే అబ్బాయి ఆత్మహత్య

Aug 27 2018 11:52 AM | Updated on Oct 9 2018 5:43 PM

Man Committed Suicide  - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, (ఇన్‌సెట్‌) బాలాజీ (ఫైల్‌)   

ఖమ్మంక్రైం : ఐదు రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువకుడు.. అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని 15వ డివిజన్‌ పార్శీ బంధం ప్రాంతానికి చెందిన సిరిగిరి మోగలాల్‌–గురువమ్మ దంపతుల మూడవ కుమారుడు బాజి అలియాస్‌ బాలాజీ(23) జాతకాలు చెబుతుండేవాడు. ఇతడు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మందులు వాడుతున్నాడు. ఇటీవల కడుపు నొప్పి తగ్గటంతో తల్లిదండ్రులు పెళ్లి కుదర్చారు. ఈ నెల 31న అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరగాల్సుంది. అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆదివారం ఉదయం అతని కుటుంబీ కులు లేచేసరికి, ఇంట్లోని దూలానికి ఉరికి వేలాడుతూ బాలాజీ కనిపించాడు. కుటుంబీకులు ఒక్కసారిగా గుండె లు పగిలేలా రోదించారు. బాలాజీ తండ్రి మోగలాల్‌ ఫిర్యాదుతో కేసును వన్‌ టౌన్‌ సీఐ రమేష్‌ ఆ«ధ్వర్యంలో ఎస్‌ఐ ప్రభాకర్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement