పెట్రోల్‌ పోసి హత్యకు యత్నం | Man Attempted To Murder With Petrol At Patancheru | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసి హత్యకు యత్నం

Dec 30 2019 1:42 AM | Updated on Dec 30 2019 1:42 AM

Man Attempted To Murder With Petrol At Patancheru - Sakshi

జిన్నారం (పటాన్‌చెరు): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడానికి కారణమైన వారిపై పెట్రోల్‌ పోసి హత్య చేసేందుకు యత్నించాడు ఓ తండ్రి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని రాంరెడ్డిబావి గ్రామంలో ఆదివారం జరిగింది. గుమ్మడిదల ఎస్‌ఐ రాజేశ్‌నాయక్‌ కథనం ప్రకారం.. రాంరెడ్డిబావి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి, సుశీల దంపతులకు నవీన్‌రెడ్డి, మమత ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ నెల 17న అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె ప్రవళిక, నవీన్‌రెడ్డిలు హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుని అమీన్‌పూర్‌లో కాపురం పెట్టారు.

ఇదిలా ఉండగా నవీన్‌రెడ్డి తల్లి సుశీల వీరికి వివాహం చేసేందుకు సహకరించిందని శ్రీనివాస్‌రెడ్డి పగను పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సుశీల ఆమె కుమార్తె మమతలు ఇంట్లో ఉండగా శ్రీనివాస్‌రెడ్డి దంపతులు సుశీల ఇంటికి వచ్చి వారితో గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన శ్రీనివాస్‌రెడ్డి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను వారిపై పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సుశీల కుమార్తె మమతకు 35 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం మమత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మమత తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement