అన్న గొంతు కోసిన తమ్ముడు | Man attacks brother | Sakshi
Sakshi News home page

అన్న గొంతు కోసిన తమ్ముడు

Jul 2 2016 5:02 PM | Updated on Sep 4 2017 3:59 AM

నగరంలోని గాంధీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదంలో.. తమ్ముడు సొంత అన్న గొంతు కోశాడు.

హైదరాబాద్ : నగరంలోని గాంధీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదంలో.. తమ్ముడు సొంత అన్న గొంతు కోశాడు. అన్న శ్రీధర్ యాదవ్‌కు తమ్ముడు శేఖర్‌యాదవ్‌కు మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరి మధ్య తిరిగి గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తమ్ముడు కత్తితో అన్నపై దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement