పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి.. | Man arrested for cheating | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి..

Jun 17 2016 4:50 PM | Updated on Mar 28 2018 11:26 AM

మళ్లీ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ వివాహితను మోసం చేశాడో ప్రబుద్ధుడు. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : మళ్లీ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ వివాహితను మోసం చేశాడో ప్రబుద్ధుడు. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి(19)కి ఇదివరకే వివాహమైంది. కాగా ఈమెకు గౌతం ప్రదీప్ అనే యువకుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో నమ్మింది. శారీరకంగా లోబరచుకున్నాక అతడు ముఖం చాటేయటంతో మోసపోయినట్లు గ్రహించి పెద్దలకు తెలిపింది. దీంతో బంధువులంతా కలసి శుక్రవారం ప్రదీప్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement