హింసను ప్రోత్సహిస్తున్న మమత: లక్ష్మణ్‌

Mamata Banerjee Encourages Violence Says k Lakshman - Sakshi

హైదరాబాద్‌: పశ్చిమ బెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హింసను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో అమిత్‌షా ప్రచారంపై రాళ్ల దాడి జరిగిన ఘటనను నిరసిస్తూ బుధవారం ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ కార్యకర్తలు కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. బెంగాల్‌లో ఎలాగైనా మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని హింసను నమ్ముకుని ఆమె రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. గత కొద్ది రోజులుగా బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు అక్కడ ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top