యుద్ధ భేరి

Mahabubnagar TRS Leaders Coming To Pragathi Nivedana Sabha - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ యుద్ధ భేరి మోగించింది. ముందస్తు ఆలోచనలో భాగంగా అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్‌ అత్యం త ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రగతి నివేదన సభ ఆదివారం జరగకుండగా విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ సభకు భారీ జనసమీకరణ ద్వారా బలప్రదర్శన చేసి విపక్షాలపై పైచేయి సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి దా దాపు 3లక్షల మందిని తరలించేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. ప్రతీ గ్రామం, ప్రతీ ఆవాసం నుంచి కూడా జనాలు తరలేలా చూస్తు న్నారు. జన రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సు లు, ప్రైవేట్‌ వాహనాలు, స్కూల్‌బస్సులు, ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ట్రాక్టర్ల ద్వారా వెళ్లే కార్యకర్తలు బయలుదేరారు. బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో ఆదివారం ఉదయం వెళ్లనున్నారు.
 
భారీ జనసమీకరణే లక్ష్యం 
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు జనసమీకరణను టీఆర్‌ఎస్‌ అధిష్టానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా ముందస్తు ఎన్నికల సమరశంఖం పూరించే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలంద రూ సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతీ నియోజకవర్గం నుంచి దాదాపు 20 నుంచి 25వేల మంది తరలించాలని ముఖ్యనేతలు ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా వారం రోజులుగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు ఎక్కడిక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించారు. అంతేకాదు... ప్రగతి నివేదన సభను ఒక ఎన్నికల సభ మాదిరిగా భావించి వచ్చే ఎన్నికల్లో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వారు హడావిడి చేస్తున్నారు.

ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నేతలు ఏ మేరకు జనసమీకరణ చేస్తున్నారు... ఎవరెవరు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నార నే అంశాలపై అధిష్టానం నిఘా ఉండడంతో నే తలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎక్కడ వెనకబడినా టికెట్టు దక్కే అవకాశాలు సన్నగిల్లుతాయనే గుబులుతో నేతలందరూ ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్‌ స్థానాలు మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొ ల్లాపూర్, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని భద్రం చేసుకునేందుకు అంచనాల కు మించి పనిచేస్తున్నారు. అలాగే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు లేని కల్వకుర్తి, వనపర్తి, అలంపూర్, గద్వాల, కొడంగల్‌ నుంచి ఆశావహులు జనసమీకరణలో పూర్తిగా నిమగ్నమయ్యారు. 

సభకు 667 బస్సులు 
ఉమ్మడి పాలమూరు నుంచి దాదాపు 3లక్షల మం ది జనాన్ని తరలించేందుకు పక్కాగా రవాణా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 20 నుంచి 25వేల మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లు వాహనాలను ఏర్పాటు చేశారు. కార్లు, ఇన్నోవా వంటి ప్రైవేట్‌ వాహనాలకు అడ్వాన్స్‌ చెల్లించేశా రు. స్థానికంగా వాహనాలు సరిపోకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తీసుకున్నారు. పక్కనున్న కర్ణాటక, ఏపీల నుంచి జిల్లాలోని నియోజకవర్గాలకు భారీగా రప్పించారు. వీటితో పాటు స్కూల్‌ బస్సులు, ఆర్టీసీ బస్సులను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒక్క ఆర్టీసీ నుంచే 667 బస్సులను వినియోగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది బస్‌డిపోల పరిధిలో 890 బస్సులు ఉండగా... 677 బస్సులను అద్దెకు తీసుకున్నారు. అంటే ఆర్టీసీ పరిధిలోని 76శాతం బస్సులను సభకు తరలుతున్నాయి. తద్వారా జిల్లా ఆర్టీసీకి ప్రగతి నివేదన సభ ద్వారా రూ.1.11 కోట్ల ఆదాయం సమకూరినట్లయింది.

అజెండాగా పాలమూరు అంశం 
టీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రగతి నివేదన సభలో పాలమూరు ప్రాంతానికి సం బంధించిన అంశమే ప్రధాన అజెండాగా ఉంటుం దని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. పాలమూరు ప్రాంత ప్రాజెక్టుల విషయమై ప్రముఖం గా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెం పాడు, కోయిల్‌సాగర్, బీమా ప్రాజెక్టులతో పాటు పాలమూరు–రంగారెడ్డి, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోత ల పథకాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. 2014లో ఉమ్మడి జిల్లా లో సాగునీటి ఆయకట్టు కేవలం 1.5లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా.. తాజాగా 7.5లక్షల ఎకరాలకు పెరిగినట్లు గణాంకాలు పేర్కొంటున్నా యి. అంతేకాదు పాలమూరు ప్రాంతంలో వల సలు తగ్గి... ప్రజల వార్షికాదాయం భారీగా పెరిగి నట్లు ప్రణాళిక విభాగం పేర్కొంటోంఛీట. ఈ నేప థ్యంలో నాలుగున్నరేళ్ల కాలంలో పాలమూరు పురోగతిలో చోటు చేసుకున్న అంశాలను ప్రధా నంగా ప్రస్తావించే అవకాశమున్నట్లు సమాచారం.
 
ప్రయాణాలు ఎలా? 
ప్రగతి నివేదన సభకు భారీ జనసమీకరణ కోసం అందుబాటులో ఉన్న వాహనాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ మేరకు ఆదివారం తప్పనిసరైతే తప్ప ప్రయాణం పెట్టుకోవద్దని ప్రభుత్వ ముఖ్యులు సూచించారు. ఆర్టీసీ బస్సులతో పాటు ట్యాక్సీలు ఇతర వాహనాలన్నీ సభ కోసం తరలివెళ్లాయి. అయితే ఆదివారం భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నందున కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.  

ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లు ర్యాలీని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి 
బాలానగర్‌ (జడ్చర్ల): రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభకు బాలానగర్‌ నుంచి భారీగా పార్టీ శ్రేణులు భారీగా బయలుదేరారు. ఈ మేరకు కొంగరకలాన్‌ వెళ్తున్న ట్రాక్టర్‌ను నడిపిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ర్యాలీని ప్రారంభించారు. జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు కర్ణం శ్రీనివాస్, నర్సింలు, గోపాల్‌ రెడ్డి, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top