రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య | lovers committed suicide on wednesday | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

Mar 26 2015 1:00 AM | Updated on Nov 6 2018 7:56 PM

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య - Sakshi

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమ జంటల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.

ఖమ్మం క్రైం:  ప్రేమ జంటల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా బుధవారం ఉదయం ఖమ్మం సమీపంలో రైలు కింద పడి ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను వరంగల్‌లోని ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన గుడిమెల్ల సాయి కృష్ణ(19), మాటేటి హిరణ్మయి(19)గా గుర్తించారు. బీటెక్ సెకండియర్ చదువుతున్న వీరిద్దరూ మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఖమ్మం చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకుని, తమ బ్యాగ్‌లను ప్లాట్‌ఫారం పైనే పడవేసి, రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు.

అనంతరం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే వీరి మరణానికి కారణమని సమాచారం. వారి బ్యాగుల్లో ఉన్న ఐడెంటిటీ కార్డుల సాయంతో మృతులను గుర్తించగలిగారు. కాగా, మృతులిద్దరూ హన్మకొండలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు. చెట్లవారిగడ్డ ప్రాంతానికి చెందిన హిరణ్మయి తండ్రి మున్సిపల్ కాంట్రాక్టర్ అని తెలిసింది.

మహబూబ్ నగర్ జిల్లా మానవ పాడు మండలం పెద్దపోతల పాడు గ్రామానికి చెందిన మాధవి (20), సుమన్ (20) లు మార్చి మొదటి వారంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని మనస్తాపానికి గురైన ఈ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా  సాయి కృష్ణ, మాటేటి హిరణ్మయి లు కూడా రైలు కింద పడి మృతి చెందడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement