పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట | Love couple approached the police | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Apr 2 2018 10:16 AM | Updated on Aug 21 2018 9:20 PM

Love couple approached  the police - Sakshi

యాలాల: కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట రక్షణ కల్పించాలంటూ ఆదివారం యాలాల పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని జక్కేపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి రేణుక, అదే గ్రామానికి చెందిన కొరవాని సురేష్‌ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరిద్దరివి వేర్వేరు కులాలు. ఇద్దరు మేజర్లు కావడంతో కేవీపీఎస్‌ నాయకుల సమక్షంలో యాలాల మండల కేంద్రంలోని  ఆంజనేయస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ యాలాల ఎస్‌ఐ సురేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య,  చైల్డ్‌లైన్‌ ప్రతినిధి వెంకటేష్, నాయకులు మైసప్ప, అంజిలప్ప, రాజు, లాలప్ప ఉన్నారు.

యాలాల పీఎస్‌ ఆవరణలో ప్రేమ జంట 

Advertisement
 
Advertisement
Advertisement