breaking news
yalala SI
-
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
యాలాల: కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట రక్షణ కల్పించాలంటూ ఆదివారం యాలాల పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని జక్కేపల్లి గ్రామానికి చెందిన పెద్దింటి రేణుక, అదే గ్రామానికి చెందిన కొరవాని సురేష్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరిద్దరివి వేర్వేరు కులాలు. ఇద్దరు మేజర్లు కావడంతో కేవీపీఎస్ నాయకుల సమక్షంలో యాలాల మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ యాలాల ఎస్ఐ సురేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పలి మల్కయ్య, చైల్డ్‌లైన్ ప్రతినిధి వెంకటేష్, నాయకులు మైసప్ప, అంజిలప్ప, రాజు, లాలప్ప ఉన్నారు. యాలాల పీఎస్ ఆవరణలో ప్రేమ జంట -
యాలాల ఎస్సైది ఆత్మహత్యే
తాండూరు(రంగారెడ్డి): గత వారం రోజులుగా వార్తల్లో పతాక శీర్షికల్లో ఉన్న యాలాల ఎస్సై రమేష్‌ది హత్యా ఆత్మహత్యా అనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడం ద్వారానే రమేష్ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలిందని.. రంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తాండూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం రమేష్‌ది ఆత్మహత్యే అని వైద్యులు నిర్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.