బతుకు బండి కదిలింది

Lockdown Relaxations Bustling Again In The Metropolitan Hyderabad - Sakshi

మహానగరంలో మళ్లీ సందడి..

మెకానిక్‌ షాపుల మొదలు చెప్పుల దుకాణాల వరకు అన్నీ ఓపెన్‌

కదిలిన ఆటోలు 

అన్ని ప్రైవేట్‌ కార్యకలాపాలు తిరిగి మొదలు

ఆచితూచి సిటిజన్ల ప్రయాణాలు

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ తర్వాత మహానగరంలో బతుకు బండి కదిలింది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌ మినహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. మెకానిక్‌ షాపుల మొదలు చెప్పుల దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. ఆటోలు, ట్యాక్సీలు, తదితర వాహనాలన్నీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

లాక్‌డౌన్‌తో 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ దృష్ట్యా మందుల షాపులు, కిరాణా షాపులు, పాలు, పండ్లు, కూరగాయలు వంటి వాటికే అనుమతిచ్చారు. ఆ తర్వాత రెండోదశలో నిర్మాణ రంగానికి చెందిన వస్తు విక్రయాలకు సడలింపు లభిం చింది. వైన్స్‌ సైతం తెరుచుకున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ షాపులు, ఆటోమొబైల్‌ షోరూంలకు అనుమతిచ్చారు.

తాజాగా ప్రజలు ఎక్కువగా గుమి గూడేందుకు అవకాశం ఉన్న మాల్స్, సినిమా హాల్స్, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు మినహా అన్నింటికీ అనుమతివ్వడంతో వస్త్ర దుకాణాలు సహా అన్నీ తెరుచుకున్నాయి. వివిధ అవసరాల కోసం జనం పెద్ద ఎత్తున బయట కొచ్చారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా సదుపాయాలు సైతం పాక్షికంగా అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మెహిదీపట్నంలో రోడ్డెక్కిన ఆటో..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు రోడ్డెక్కాయి. అలాగే ఉబర్, ఓలా, తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ట్యాక్సీలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు సుమారు 26 వేలకు పైగా వాహనాలు రోడ్డెక్కినట్లు తెలంగాణ క్యాబ్‌డ్రైవర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఐటీ కారిడార్లలో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ క్యాబ్‌ అగ్రిగేటర్లు డ్రైవర్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, వాహనాలు నడపడంలో ఇబ్బందిగా ఉందని అసోసియేషన్‌ ప్రతినిధి షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. మరోవైపు ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా ఉధృతి దృష్ట్యా నగరవాసులు ఆచితూచి ప్రయాణం చేస్తున్నారు.

అవసరమైతే తప్ప వాటిని వినియోగించుకోవట్లేదు. వీలైనంత వరకు సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రజారవాణా వాహనాల కంటే కార్లు, ద్విచక్ర వాహనాల రద్దీయే ఎక్కువగా కన్పిస్తోంది. వ్యాపార కేంద్రాలు తెరుచుకున్నా.. కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. తిరిగి సాధారణ వాతావరణం నెలకొనేందుకు మరో వారం రోజులు పట్టొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ దుకాణం ముందు చెప్పులు కుడుతున్న దృశ్యం..

శివార్లకే పరిమితం..
హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సుల రాకపోకలకు అనుమతివ్వడంతో సుమారు 400 బస్సులు మొదటి రోజు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వీటిని నగర శివార్ల వరకే అనుమతించారు. 139 బస్సులు జేబీఎస్‌ వరకు వచ్చాయి. కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని జేబీఎస్‌ వరకు అనుమతించారు. వరంగల్, హన్మకొండ, జనగామ వైపు నుంచి 60 బస్సులు ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వరకు వచ్చాయి.

ఖమ్మం, నల్లగొండ మీదుగా వచ్చే వాటిని హయత్‌నగర్‌ వరకు అనుమతించారు. 70 బస్సులు ఈ రూట్‌లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాయి. మహబూబ్‌నగర్‌ వైపు నుంచి 102 బస్సులు వచ్చాయి. ఇవి ఆరాంఘడ్‌ వరకు రాకపోకలు సాగించాయి. చేవెళ్ల, శంకర్‌పల్లి నుంచి వచ్చిన 30 బస్సులు అప్పా జంక్షన్‌ వరకు రాకపోకలు సాగించాయి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు. మొదటి రోజు కావడంతో ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది.

ఒక్కో బస్సులో 20 నుంచి 30 మంది మాత్రమే ప్రయాణం చేశారు. బస్సులు ఎక్కే సమయంలో మాస్కు ఉన్న వారినే లోపలికి అనుమతించారు. భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ సిబ్బంది బస్‌స్టాండ్లలో విధులు నిర్వహించారు. బస్సు ఎక్కిన ప్రయాణికులు తప్పనిసరిగా శానిటైజర్‌ ద్వారా చేతులు శుభ్రం చేసుకొన్న తర్వాతే సీట్లోకి వెళ్లి కూర్చునేలా డ్రైవర్లు జాగ్రత్తలు పాటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 02:33 IST
సాక్షి, నెట్‌వర్క్‌: కరోనా ఫస్ట్‌ వేవ్‌లో ఉమ్మడి పాలమూరు పరిధిలోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట ఐదు...
07-05-2021
May 07, 2021, 02:16 IST
కరోనా పేదల జీవితాల్లో కల్లోలం రేపింది. వారి బతుకులను ఆగమాగం చేసింది. కరోనా కట్టడికిగాను గత ఏడాది ఏప్రిల్, మే...
07-05-2021
May 07, 2021, 01:43 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేసి ఫలితం ఆధారంగా చికిత్స మొదలుపెట్టడం ఇప్పటివరకు అనుసరించిన పద్ధతి....
07-05-2021
May 07, 2021, 01:25 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌  విధించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధిస్తే జనజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక...
07-05-2021
May 07, 2021, 01:13 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ సినీ గాయకుడు జి.ఆనంద్‌ (67) కరోనా బారిన పడి...
07-05-2021
May 07, 2021, 00:48 IST
కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్‌ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల...
07-05-2021
May 07, 2021, 00:32 IST
బెంగళూరు: భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి ఇంట మరోసారి విషాదం చోటు చేసుకుంది. గత ఏప్రిల్‌ 23న కరోనా వైరస్‌...
06-05-2021
May 06, 2021, 21:30 IST
తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని ఆరా. కరోనా కట్టడి చర్యలు.. వ్యాక్సినేషన్‌ తదితర అంశాలు తెలుసుకున్న ప్రధాని
06-05-2021
May 06, 2021, 20:01 IST
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ఎన్‌440కే వేరియంట్‌పై సీసీఎంబీ క్లారిటీ ఇచ్చింది. ఇది కొత్త రకం వేరియంట్‌ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న...
06-05-2021
May 06, 2021, 19:46 IST
న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. రోజు ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. కోవిడ్ క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ...
06-05-2021
May 06, 2021, 19:09 IST
బాలీవుడ్‌ నటి  శ్రీపద  కరోనాతో కన్ను మూశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  ట్విటర్‌ ద్వారా  శ్రీపద మరణంపై...
06-05-2021
May 06, 2021, 18:53 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,10,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,954  కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 18:34 IST
కరోనా  నివారణకు సంబంధిం సింగిల్‌ డోస్‌ స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను  ఆమోదించినట్టు వెల్లడించింది.  స్పుత్నిక్  ఫ్యామిలీకే చెందిన ఈ సింగిల్-డోస్ ‘స్పుత్నిక్ లైట్’ విప్లవాత్మకమైందని, 80 శాతం...
06-05-2021
May 06, 2021, 17:25 IST
ఢిల్లీ: భారత్‌లో క‌రోనా వైర‌స్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా...
06-05-2021
May 06, 2021, 17:14 IST
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50...
06-05-2021
May 06, 2021, 17:12 IST
న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధానిలో ఆక్సిజ‌న్ కొర‌త‌పై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీకి ప్ర‌తిరోజు 700 మెట్రిక్...
06-05-2021
May 06, 2021, 16:30 IST
ఢిల్లీ: కరోనా థర్డ్‌వేవ్‌ హెచ్చరికలపై సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. థర్ఢ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కొంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది. దేశంలో...
06-05-2021
May 06, 2021, 15:23 IST
సాక్షి, మియాపూర్‌: ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చనిపోయాడని ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది....
06-05-2021
May 06, 2021, 15:16 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 14:36 IST
జైపూర్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్‌వేవ్‌లో వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top