‘వెట్టిచాకిరీ చేస్తున్న షాపింగ్‌మాల్స్‌ కార్మికులు’  | Less Money More Duty In Shopping Malls | Sakshi
Sakshi News home page

‘వెట్టిచాకిరీ చేస్తున్న షాపింగ్‌మాల్స్‌ కార్మికులు’ 

Mar 30 2018 9:33 AM | Updated on Sep 2 2018 4:03 PM

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని షాపింగ్‌ మాల్స్‌లో పని చేస్తున్న కార్మికులు ఏళ్ల తరబడిగా వెట్టిచాకిరీ చే స్తున్నారని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మూ షం రమేశ్‌ అన్నారు. యూనియన్‌ కార్యాలయంలో గురువారం జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కో కార్మికునితో యజమాన్యాలు 8 గంటలకు మించి పనిచేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ.4 వేల నుంచి రూ.6 వేలలోపే వేతనాలు చెల్లిస్తూ.. కనీ స వేతన చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని తెలి పారు. కార్మికులకు అధికారులు కనీస వేతనాలు అమలు చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మోర అజయ్, అన్నల్‌దాస్‌ గణేశ్, ఒగ్గు గణేశ్, నక్క దేవదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement