అచ్చొచ్చిన చోట.. అలవోకగా.. ‘గెలుపు’

 Leaders in Medak district have been thrown into the thrill of nerves. - Sakshi

మెదక్‌ జిల్లాలో నాయకులకు నేటితో నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెదక్‌ జిల్లా నాయకుల భవిష్యత్తును మార్చాయి. గతంలో  మెదక్‌లో టీఆర్‌ఎస్‌ పది స్ధానాలను గెలుచుకుంది, కానీ ఇప్పుడు తొమ్మిది స్ధానాలకు పరిమితమైన ఓటు బ్యాంకు పెరగడంతో భారీ మెజారీటీతో మెదక్‌లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించారు.  ఉద్యమాల గడ్డగా పేరొందిన ‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత  లక్ష మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్‌ రావు చరిత్ర సృష్టించారు.

సాక్షి,  మెదక్‌ : మెదక్‌లో రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటు, అడ్వకేట్ గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వంతో  మెదక్‌ స్ధానాన్ని టీఆర్‌ఎస్‌  అభ్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు.

మెదక్‌ జిల్లాలో గతంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది.ఈసారి ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఒక స్థానాన్ని కొల్సోయింది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ , హరీష్‌ రావులకు  బలమైన  కేడర్‌ ఉన్నా కానీ ఈసారి జిల్లాలో  కాంగ్రెస్‌ పార్టీ ఒక నియోజకవర్గంలో ప్రజల మద్దతును పొందింది.  సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో గెలిచిన చింతా ప్రభాకర్‌  ఈ ఎన్నికల్లో ఒటమి చెందారు. ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్ధి జగ్గారెడ్డి గెలుపోందారు.

హరీష్‌ రావు ఇలాకా సిద్దిపేటలో గతంలో కన్న ఈసారి భారీ మెజారీటితో గెలిచారు. కష్టపడేతత్వమే ఈయన బలం,  నిత్యం ప్రజలతో మమేకం అయ్యే  హరీష్‌ రావుకు, సిద్దిపేటలో టీ.జే.ఎస్‌ అభ్యర్ధి భవాని రెడ్డి ప్రత్యర్ధిగా నిలుచున్న గట్టిపోటీ ఇవ్వలేక​ పొయింది. ఎందుకంటే హరీష్‌ రావుకు  సిద్దిపేటలో ట్రబుల్‌ షూటర్‌కు కబలమైన కేడర్‌ ఉండడం వల్ల లక్ష పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు  హరీష్‌ రావు చరిత్ర సృష్టించారు.

నర్సాపూర్‌లో  కాంగ్రెస్‌ అభ్యర్ధి సునీతారెడ్డి పైన   టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి చిలుముల మదన్‌ రెడ్డి విజయం సాధించారు.  జహీరాబాద్‌లో  టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కె.మాణిక్‌రావు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్‌ అభ్యర్ధి గీతారెడ్డి ఒటమి పాలైనారు.  పఠాన్‌చెరులో టీఆర్‌ఎస్‌  అభ్యర్ధి గూడెం మహిపాల్‌ రెడ్డి,   కాంగ్రెస్‌ అభ్యర్ధి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ పైన గెలిచారు.

ఆందోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ గట్టి పోటీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి చంటి క్రాంతి కిరణ్‌ గెలుపొందారు.  నారయణఖేడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి సురేశ్‌ షెట్కార్‌ , టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి భుపాల్‌రెడ్డి పైన చిత్తుగా ఒడిపోయారు.  దుబ్బాకలో  కాంగ్రెస్‌ అభ్యర్ధి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పైన , టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు.

మాటల మాంత్రికుడు తనదైన పరిపాలనతో, ప్రత్యర్ధుల మాటలకు తన తూటలకు విసారే వాక్చాతుర్యంతో,  కేసీఆర్‌ పోటీ చేసిన గజ్వేల్‌ నియోజకవర్గంలో  కాంగ్రెస్‌ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి ,  బీజేపీ అభ్యర్ధి ఆకుల విజయ లు కేసీఆర్‌కు ఎంత పోటీ ఇచ్చిన, అభివృద్దే మంత్రంగా భావించే కేసీఆర్‌  గజ్వేల్‌ స్ధానాన్ని మరోసారి భారీ విజయంతో నిలబెట్టుకున్నారు.

నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ
మెదక్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌
నర్సాపూర్‌ చిలుముల మదన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌
జహీరాబాద్‌(ఎస్సీ) కె. మాణిక్‌ రావు టీఆర్‌ఎస్‌
సంగారెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్‌
ఆందోల్‌ చంటి క్రాంతి కిరణ్‌ టీఆర్‌ఎస్‌
పఠాన్‌చెరు గూడెం మహిపాల్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌
సిద్దిపేట టీ. హరీశ్‌ రావు టీఆర్‌ఎస్‌
గజ్వేల్‌ కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌
హూస్నాబాద్‌ వడితెల సతీష్‌ కుమార్‌ టీఆర్‌ఎస్‌
దుబ్బాక సోలిపేట రామలింగా రెడ్డి టీఆర్‌ఎస్‌
నారాయణఖేడ్‌ ఎమ్‌. భూపాల్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top