రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట: మంత్రి కేటీఆర్‌ | Land Pooja for Pharmaceuticals Company | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పరిశ్రమలకు పెద్దపీట: మంత్రి కేటీఆర్‌

Jul 1 2018 2:51 AM | Updated on Jul 1 2018 2:51 AM

Land Pooja for Pharmaceuticals Company - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి జినోమ్‌ వ్యాలీలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఫెరింగ్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీకి శనివారం ఆ సంస్థ సీఈఓ సురేశ్‌ పట్టతిల్‌తో కలసి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు.

జినోమ్‌ వ్యాలీలో అనేక బయోటెక్‌ పరిశ్రమలు ఉన్నాయని, ఫెరింగ్‌ ఫార్మాసూటికల్స్‌ను ఇక్కడ నిర్మించడం అభినందనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్, కంపెనీ ప్రతినిధులు లార్స్‌ పీటర్‌ బ్రూన్స్, వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్, ఎంపీపీ చంద్రశేఖర్‌ యాదవ్, సర్పంచ్‌ కిశోర్‌యాదవ్, ఎంపీటీసీ ఎండీ జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement