‘తెలంగాణ ఇచ్చారు.. కాళ్లు చేతులు నరికారు’ | Kura Rajanna demands special concil for polavaram tribels | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ ఇచ్చారు.. కాళ్లు చేతులు నరికారు’

Jul 16 2014 4:35 PM | Updated on Aug 21 2018 8:34 PM

‘తెలంగాణ ఇచ్చారు.. కాళ్లు చేతులు నరికారు’ - Sakshi

‘తెలంగాణ ఇచ్చారు.. కాళ్లు చేతులు నరికారు’

పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని జనశక్తి అగ్రనేత కూర రాజన్న వ్యతిరేకించారు.

వేములవాడ: పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడాన్ని జనశక్తి అగ్రనేత కూర రాజన్న వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి.. దాని కాళ్లు చేతులు నరికివేసిందని వ్యాఖ్యానించారు. ఓ కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడ కోర్టుకు వచ్చారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీల సంపదను కొల్లగొడుతున్న ప్రభుత్వం ఐదో షెడ్యూల్ ప్రకారం వారికి ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందనడంలో అర్థమేలేదన్నారు. ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించడం లేదని, అయితే ఇంజనీర్ల సూచ న మేరకు భారీ ప్రాజెక్టుకు బదులుగా బ్యారేజీలు కడితే సరిపోతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement