మన మెట్రో రైలుకే ఆ ఘనత: కేటీఆర్‌

 KTR Excellent Speech On MMTS And Hyderabad Metro Rail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం మెట్రో రైలుపై చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం 57 మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని హంగులతో మెట్రో ప్రారంభానికి సిద్ధమైందన్నారు. ఈ నెల 28న మెట్రో రైలును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినట్టు తెలిపారు.

ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించిందని, ఆ నిధుల్లో ఇప్పటికే 2,240 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. అసెంబ్లీ, సుల్తాన్‌ బజార్‌, పాత బస్తీ అలైన్‌మెంట్‌ను పరిశీలించామని.. పాత రూట్‌నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. మెట్రో ఫేజ్‌-2 కు త్వరలో తుది రూపు వస్తుందని తెలిపారు.

Back to Top