‘ఫార్మా సిటీతో హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం’

Komatireddy Venkat Reddy Meets With Narendra Modi In Delhi - Sakshi

ఢిల్లీ: హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. మొదట మూడు వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ఫార్మా సిటీని 19,333 ఎకరాలకు పెంచారన్నారు. ఫార్మా సిటీ వల్ల  హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం ఉంటుందని తెలిపారు. ఎయిర్ పోర్టు దగ్గరలో ఫార్మా సిటీ రానివ్వమని ఆయన అన్నారు. మరొకచోట ఏర్పాటు చేయాలన సూచించినట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారిగా గుర్తించాలని ప్రధాని మోదీని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 

అదేవిధంగా కాపర్,జింక్, ఇతర విష పదార్థాలు మూసినది నీటిలో మోతాదుకు మించి కలుస్తున్నాయని కోమటిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దాంతోపాటు మూసినది శుధ్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని కోమటిరెడ్డి ప్రధానిని కోరారు. అదేవిధంగా సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తన విజ్ఞప్తులకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు. ఇంటింటికీ నీరు ఇంకా అందడం లేదన్నారు. హౌసింగ్ పథకాన్ని కేంద్రమే చేపట్టాలని కోమటిరెడ్డి ప్రధాని దృషష్టికి తీసుకు వెళ్లినట్లు కోమటిరెడ్డి వివరించారు.

అదేవిధంగా  ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గౌరెల్లి జంక్షన్-కొత్తగూడెం జాతీయ రహదారికి నెంబరింగ్ ఇవవ్వాలని కోమటిరెడడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు.వలిగొండ, పోచంపల్లి, తిరుమలగిరి, తొర్రురు, నెల్లికుదురు, మహబూబద్, ఇల్లందు మీదుగా హైద్రాబాద్-కొత్త గూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంట్ పరిధిలో ఈ జాతీయ రహదారి వంద కిలోమీటర్లు ఉంటుందని ఆయన తెలిపారు. 2016లొనే డీపీఆర్‌ సిద్ధం చేశారని.. నేటికి పనులు మొదలు కాలేదన్నారు.

2019లో ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు నెంబరింగ్ ఇవ్వలేదన్నారు. అప్ గ్రెడెషన్ పనులను త్వరగా ప్రారంభించాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. డీపీఆర్ సిద్ధంగా ఉందని.. ఆమోదించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు మీడియాకు తెలిపారు. మారుమూల గిరిజన తండాలు, భద్రాచలం దేవస్థానం ఉన్న రహదారి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి లేఖను ప్రధాని మోదీకి అందజేసినటట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top