‘ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తాం’ | Komatireddy Rajagopal Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తాం : రాజగోపాల్‌ రెడ్డి

Jul 19 2019 2:37 PM | Updated on Jul 19 2019 2:48 PM

Komatireddy Rajagopal Reddy Fires On KCR - Sakshi

సాక్షి, నల్గొండ : ప్రభుత్వం.. ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.100 కోట్లు మంజూరు చేస్తే శివన్న గూడం, కృష్ణ రాంపల్లి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని తెలిపారు. 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.. కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని విమర్శించారు. ప్రాజెక్ట్‌లు, భూనిర్వాసితుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ భూనిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎన్నికలు వస్తేనే ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. భట్టి విక్రమార్కను సభలో మాట్లాడనీయకపోవడం బాధాకరం అన్నారు రాజగోపాల్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement