కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖులు తరలి వచ్చారు.
హైదరాబాద్ : కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖులు తరలి వచ్చారు. రాజ్భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నాదెండ్ల మనోహర్, నాదెండ్ల భాస్కర్, యాదవరెడ్డి, అసదుద్దీన్ సోదరులు, కోదండరామ్ దంపతులు, మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్, సీపీఐ నారాయణ, గుత్తా జ్వాల, తెలంగాణ రచయితలు, కవులు, రాజకీయ విశ్లేషకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చేశారు.