'గ్రామజ్యోతి పథకాన్ని స్వాగతిస్తున్నాం' | kishan reddy statement on gramajyothi | Sakshi
Sakshi News home page

'గ్రామజ్యోతి పథకాన్ని స్వాగతిస్తున్నాం'

Aug 12 2015 10:31 AM | Updated on Sep 3 2017 7:19 AM

తోటపల్లి రిజర్వాయర్పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

కరీంనగర్: తోటపల్లి రిజర్వాయర్పై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గ్రామజ్యోతి' పథకాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తోటపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్నదే బీజేపీ డిమాండ్ అని అన్నారు. మహిళా సంఘాలతో చర్చించిన తర్వతనే ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం పాలసీపై నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement