టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే

Published Tue, Jun 3 2014 10:49 AM

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే - Sakshi

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేశవరావు ఎంపిక అయ్యారు. లోక్సభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా జితేందర్ రెడ్డి, ఉప నాయకుడిగా వినోద్, విప్గా కడియం శ్రీహరిని  టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం  నియమించారు.  ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన జితేందర్‌రెడ్డి లోక్‌సభలో టిఆర్ఎస్ నాయకుడిగాగా, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన వినోద్కు ఉప నాయకుడిగా, వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరికి విప్ పదవి లభించింది.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్.. అటు కాంగ్రెస్, ఇటు బిజెపితో సయోధ్యకు చొరవ చూపుతున్నారు. అందుకే రెండు పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement