బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం | kcr will possible gold Telangana | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యం

Sep 7 2014 2:34 AM | Updated on Aug 15 2018 9:22 PM

సుదీర్ఘ పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు.

 మోత్కూరు : సుదీర్ఘ పోరాటం తర్వాత ఆవిర్భవించిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి సీఎం కేసీఆర్‌కే ఉందని  తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. శనివారం టీడీపీ మోత్కూరు పట్టణశాఖ కార్యదర్శి వర్రె రాములు, ఆయన అనుచరులు 40 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 10 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం, పదవులకోసం టీఆర్‌ఎస్ పాకులాడలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పనిచేసిందన్నారు.
 
 ఆంధ్రా నాయకుల చేతిలో తెలంగాణను తాకట్టుపెట్టిన టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత నాయకులు టీఆర్‌ఎస్‌ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో వివిధ పార్టీలనుంచి కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రామకృష్ణారెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు కొణతం యాకుబ్‌రెడ్డి, ఎం పీపీ ఓర్సు లక్ష్మి, మోత్కూరు ఎంపీటీసీ సభ్యు డు జంగ శ్రీను, నాయకులు పురుగుల వెంకన్న, మంచ గోవర్ధన్, బి.వెంకటయ్య, దేవ, సీహెచ్.మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement