ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే | kcr to go for aerial survey for film, pharma cities | Sakshi
Sakshi News home page

ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే

Dec 2 2014 7:29 PM | Updated on Aug 14 2018 10:51 AM

ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే - Sakshi

ఫిలింసిటీ కోసం.. రేపు కేసీఆర్ ఏరియల్ సర్వే

తెలంగాణలో కొత్తగా ఫిలిం సిటీ, ఫార్మా సిటీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు ఏరియల్ సర్వే చేయనున్నారు.

తెలంగాణలో కొత్తగా ఫిలిం సిటీ, ఫార్మా సిటీల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం నాడు ఏరియల్ సర్వే చేయనున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జల్లాల్లో ఆయన ఈ సర్వే చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగుతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడినుంచి ఆంధ్రా ప్రాంతానికి తరలిపోకుండా ఉండేందుకు ఇక్కడే సమస్త సదుపాయాలతో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఫిలింసిటీ నిర్మించాలని కేసీఆర్ పలు సందర్భాలలో తెలిపారు. అలాగే ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కూడా తరలిపోయే అవకాశం ఉన్నందున.. వాటికోసం కూడా సదుపాయాలు కల్పించాలని ఆయన భావిస్తున్నారు. ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో భూములను పరిశీలించి, ఫొటో ఎగ్జిబిషన్ చూస్తారు. అలాగే పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement