ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు.
హైదరాబాద్: ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. నియంతృత్వ ధోరణితో కేసీఆర్ ధర్నా చౌక్‌ను తరలిస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా ధర్నా చౌక్ ఎత్తి వేయలేదు అన్న కేసీఆర్ ఎందుకు పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలియ చేయలేదని ప్రశ్నించారు.
ధర్నా చౌక్ పై కోర్ట్‌ను ఆశ్రయించామని, కోర్ట్ తీర్పు న్యాయంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి తెలియచేసింది ధర్నా చౌక్ అని గుర్తు చేశారు. నగర శివారులోని అడవి ప్రాంత లో ధర్నా చౌక్ ని కేటాయించారు..ఇది సమంజసమా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్ అసెంబ్లీ లాంటిదని..దాన్ని ఇందిరా పార్క్ వద్దే కొనసాగించాలని డిమాండ్ చేశారు.