గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ ఘన నివాళి | KCR pays tribute to Telangana Martyrs at Gun park | Sakshi
Sakshi News home page

గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ ఘన నివాళి

Jun 2 2014 7:41 AM | Updated on Aug 21 2018 3:16 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపం సందర్శించి అంజలి ఘటించారు. కేసీఆర్తో పాటు కేకే, హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఉన్నారు.     అనంతరం కేసీఆర్ రాజ్ భవన్కు బయల్దేరారు. ఉదయం 8.10 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement