అంబేడ్కర్‌తోనే దేశం ముందడుగు: కేసీఆర్‌  | kCR Participate In Ambedkar Jayanti | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌తోనే దేశం ముందడుగు: కేసీఆర్‌ 

Apr 15 2018 1:56 AM | Updated on Aug 17 2018 8:11 PM

kCR Participate In Ambedkar Jayanti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంబేడ్కర్‌ దూరదృష్టి, దార్శనికత వల్లే ఇవాళ దేశం సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేస్తున్నదని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. శనివారం అంబే డ్కర్‌ జయంతి పురస్కరించుకుని సీఎం, అంబేడ్కర్‌ సేవలను స్మరించుకున్నారు. భారతీయ సమాజాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని, భవిష్యత్‌ మార్గనిర్దేశనం చేసిన రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, భారత సమాజ పురోగతికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement