
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులకు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రభుత్వవర్గాల్లో కలకలం రేగింది. వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. గత నాలుగు రోజులుగా సీఎం గజ్వేల్‌లోని ఆయన నివాసగృహంలో ఉంటున్నారు. అయితే, ప్రగతిభవన్ ఉద్యోగులకు కరోనా అంశంపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.