‘మందుపాతరలు పెట్టాం’ అనే సమాచారం శుక్రవారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించింది.
జగదేవ్‌పూర్: ‘మందుపాతరలు పెట్టాం’ అనే సమాచారం శుక్రవారం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించింది. అది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉరుకులు పరుగులు తీశారు.
వివరాలు.. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ సీఐ శంకర్‌గౌడ్‌కు జగదేవ్‌పూర్ సమీపంలోని గొల్లపల్లికి వెళ్లే రోడ్డు పక్కన స్త్రీ శక్తి భవనం వెనుక నక్సల్స్ గతంలో మందు పాతరలు పెట్టినట్లు శుక్రవారం సమాచారం అందింది. దీంతో ఆయన స్థానిక ఎస్‌ఐ వీరన్నకు సమాచారం అందించారు.
ఉన్నతాధికారులకు సమాచారం అందించిన ఆయన.. సుమారు 30 మంది సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం జేసీబీతో తవ్వకాలు జరిపారు. చివరికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.