కేసీఆర్కు దొరతనం దిగలేదు: డీఎస్ | kcr insulted dalit deputy cm, says d srinivas | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు దొరతనం దిగలేదు: డీఎస్

Sep 15 2014 4:00 PM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్కు దొరతనం దిగలేదు: డీఎస్ - Sakshi

కేసీఆర్కు దొరతనం దిగలేదు: డీఎస్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు దొరతనం ఇంకా దిగలేదని, అందుకే దళితుడైన ఉప ముఖ్యమంత్రిని ఆయన అవమానించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు దొరతనం ఇంకా దిగలేదని, అందుకే దళితుడైన ఉప ముఖ్యమంత్రిని ఆయన అవమానించారని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మండిపడ్డారు. జలవిహార్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో నిర్వహించాలని, జాప్యం చేస్తే ఎన్నికలకు కేసీఆర్ భయపడుతున్నట్టేనని డీఎస్ అన్నారు.

సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు ఓటేసిన సెటిలర్లు సంతోషంగా లేరని, ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా.. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని డి.శ్రీనివాస్ చెప్పారు. ఈ పరిస్థితిని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు వారికి అనుకూలంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement