ములుగులో సీఎం కేసీఆర్‌ 

KCR Condolence To TRS Youth Leader - Sakshi

ములుగు (గజ్వేల్‌): మండల టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగ అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి తల్లి వజ్రమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హాజరయ్యారు. పది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని సీఎం పరామర్శించారు.  అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితుడు, ఎర్రవల్లి ఫాంహౌస్‌ ఇన్‌చార్జి, వంటిమామిడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహ్మద్‌ జహంగీర్‌ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top