కేసీఆర్ మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆత్మహత్య | KCR chief security Officer attempt suicide | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాజీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆత్మహత్య

Aug 8 2014 5:00 PM | Updated on Aug 15 2018 9:22 PM

సురేశ్ రావు పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే సురేశ్ ఆత్మహత్యయత్నానికి కారణాలు తెలియరాలేదు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఛీప్ సెక్యూరిటీ అఫీసర్ గా సేవలందించిన సురేశ్ రావు శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు.  తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. సురేశ్ రావు పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. 
 
గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ కుమార్ విధులకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవలే ఇంటిలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా విధుల్లో చేరినట్టు సమాచారం. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుంది.
 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement