
సింగపూర్.. అమెరికా సరసన నిలిచింది!
అయిదురోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ఆదివారం నగరానికి చేరుకున్న కేసీఆర్ ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్:అయిదురోజుల సింగపూర్ పర్యటనను ముగించుకుని ఆదివారం నగరానికి చేరుకున్న కేసీఆర్ ఆ దేశంపై ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం సింగపూర్ పర్యటనకు సంబంధించిన పలు అంశాలను మీడియాతో పంచుకున్న ఆయన.. ఆ పర్యటన అద్భుత అనుభూతిని కలిగించిందన్నారు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఎలా అభివృద్ధి చెందాలో చెప్పిన దేశం సింగపూర్ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంచి నీళ్లు కూడా సింగపూర్.. ఇవాళ ఆర్థిక ప్రగతిలో అమెరికా సరసన నిలిచిందన్నారు. సింగపూర్ అభివృద్ధి మంత్రం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇవాళ అమెరికా సరసన ఆ దేశం నిలిచిదంటే అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన ముందుచూపే ప్రధాన కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతామని సింగపూర్ లో పలువురు పారిశ్రామివేత్తలు హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. తాను సింగపూర్ లో చేసిన అధ్యయనం తెలంగాణ పునర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు.