ఆంధ్ర బాబుల మోచేతి నీళ్లు తాగడం మానుకోవాలి | kadiyam srihari takes on chandrababu | Sakshi
Sakshi News home page

ఆంధ్ర బాబుల మోచేతి నీళ్లు తాగడం మానుకోవాలి

Apr 23 2015 9:53 PM | Updated on Sep 6 2018 3:01 PM

ఆంధ్ర బాబుల మోచేతి నీళ్లు తాగడం మానుకోవాలి - Sakshi

ఆంధ్ర బాబుల మోచేతి నీళ్లు తాగడం మానుకోవాలి

రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రబాబుల మోచేతి నీళ్లు తాగడాన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి టీ.టీడీపీ నేతలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు.

వరంగల్ : రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రబాబుల మోచేతి నీళ్లు తాగడాన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి టీ.టీడీపీ నేతలు మానుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం కర్రెవారి కుంటలో మిషన్ కాకతీయ కార్యక్రమంలో పూడికతీత, కట్ట మరమ్మతు పనులను గురువారం ఆయన ప్రారంభించారు.

అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల పోరాటం, అనేకమంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇంకా చంద్రబాబు వంటి ఆంధ్రబాబుల నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అతి తక్కువ సమయంలోనే 30 ఏళ్లుగా ఎప్పుడూ లేనివిధంగా వేసవిలో సైతం కరెంట్ కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తూ, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందేవిధంగా ప్రవేశపెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు దీవించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement