ఎక్సైజ్ కోర్టు జడ్జి సస్పెన్షన్ | Judge excise suspension | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ కోర్టు జడ్జి సస్పెన్షన్

Apr 22 2016 1:15 AM | Updated on Oct 2 2018 4:34 PM

లోక్ అదాలత్‌లలో పరిష్కారమైన కేసుల్లో చెల్లించిన జరిమానా డబ్బులను రికార్డుల్లో పేర్కొనకుండా, కోర్టులో జమ ...

 వరంగల్ లీగల్ : లోక్ అదాలత్‌లలో పరిష్కారమైన కేసుల్లో చెల్లించిన జరిమానా డబ్బులను రికార్డుల్లో పేర్కొనకుండా, కోర్టులో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై వరంగల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎ.ఆర్.విలాసితను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డారుు. గత సంవత్సరం డిసెంబర్ 12న, ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న, మార్చి 12న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లలో ఎక్సైజ్ కోర్టు పరిధిలో రాజీకి అవకాశం ఉన్న 55 కేసులు పరిష్కారమయ్యూరుు. వీటిలో జరిమానా రూపంలో చెల్లించిన  డబ్బులు కోర్టులో డిపాజిట్ చేయకుండా, రికార్డులో సైతం పేర్కొనలేదు.

తప్పుడు చాలానా లు, స్టాంపులు సృష్టించి ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై సస్పెండ్ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆరవ ము న్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి రఘునాథ్‌రెడ్డిని ఎక్సైజ్ కోర్టుకు ఇన్‌చార్జి జడ్జిగా అదనపు బా ధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement