గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం | Sakshi
Sakshi News home page

గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో మోసం

Published Mon, Oct 23 2017 12:11 PM

Jobs At Gandhi Hospital for Notes, Couple Cheats Rs. 20 Lakh

సాక్షి, సికింద్రాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో శానీటరీ విభాగంలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. సిద్ధిపేటకు చెందిన కనకరాజు, లావణ్య దంపతులు నగరంలోని గాంధీ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద నుంచి ఇప్పటివరకూ రూ. 20 లక్షల మేర వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో.. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సిద్దిపేట పోలీసులు ఈ అంశంలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

బాధితుల సంఖ్య 20 నుంచి 30 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. కాల్‌డేటా ఆధారంగా రవి, లావణ్యల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. బాధితులు అందరూ గతంలో పలుమార్లు గాంధీ ఆసుపత్రిలోని శానిటేషన్‌ విభాగానికి వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement