జగ్గారెడ్డికి కోర్టులో ఊరట | jagga reddy gets bail | Sakshi
Sakshi News home page

జగ్గారెడ్డికి కోర్టులో ఊరట

Sep 3 2014 5:51 PM | Updated on Sep 2 2017 12:49 PM

జగ్గారెడ్డికి కోర్టులో ఊరట

జగ్గారెడ్డికి కోర్టులో ఊరట

మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి)కి కోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి)కి కోర్టులో ఊరట లభించింది. టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి కేసులో సంగారెడ్డి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇంతకుముందు ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

 సదాశివపేటలో ఒక వ్యక్తిని కొట్టినందుకు, సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినందుకు, సిద్దిపేటలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై కేసులు నమోదయ్యాయి.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై సిద్దిపేటలో కూడా ఓ కేసు నమోదైంది.

 
 

Advertisement
 
Advertisement
Advertisement