
సాక్షి, హైదరాబాద్: నాడు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక ప్రజోపయోగ పథకాలు ప్రవేశపెట్టారని, ఇప్పు డు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని కొనియాడారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు 25 శాతం సీట్లు, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చేందుకు చర్యలు, అమ్మ ఒడి లాంటి కార్యక్రమాలను జగన్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. తెలంగాణలో కూడా విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించామని, కానీ కనీసం బోధనా సౌకర్యాలు కల్పించడం లో కూడా ప్రభుత్వం విఫలమైందన్నార