అమెజాన్ గోడౌన్‌లో భారీ చోరీ | Items theft at amazon godown in rangareddy district | Sakshi
Sakshi News home page

అమెజాన్ గోడౌన్‌లో భారీ చోరీ

Feb 23 2017 9:58 AM | Updated on Oct 4 2018 8:29 PM

అమెజాన్ గోడౌన్‌లో భారీ చోరీ - Sakshi

అమెజాన్ గోడౌన్‌లో భారీ చోరీ

ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది.

కొత్తూరు(శంషాబాద్): ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గురువారం ఈ ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ గోడౌన్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలో ఉన్న అమెజాన్ కంపెనీ గౌడౌన్‌లో 36 ల్యాప్ టాప్‌లు సహా మరొకొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయని నిర్వాహకులు గుర్తించారు.

యాజమాన్యం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement