రాత్రివేళ రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకుని సేదతీరుతున్న వారిని టార్గెట్ చేస్తూ కత్తులతో బెదిరించి నగదు, బంగారం, సెల్‌ఫోన్లు
కోదాడ రూరల్ : రాత్రివేళ రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకుని సేదతీరుతున్న వారిని టార్గెట్ చేస్తూ కత్తులతో బెదిరించి నగదు, బంగారం, సెల్‌ఫోన్లు దొంగలిస్తున్న అంతరాష్ట్ర దారిదోపిడీ దొంగల ముఠాను కోదాడరూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం తెల్లవారు జామున పట్టుకున్నారు. మధ్యాహ్నం సూర్యాపేట డీఎస్పీ అబ్దుల్ష్రీద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పెరాయిగూడెంకు చెందిన మేహార్‌షిండే, అదేగ్రామానికి చెందిన ఎళ్లు షిండే, మల్కాజ్‌షిండే, కర్నూలు జిల్లా పందిపాడుకుకు చెందిన వీరులు నలుగురు ఒక ముఠాగా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడేవారు. ఈ మధ్య కోదాడ ప్రాంతంలో పగటిపూట కీ చైన్స్ విక్రయిస్తూ రాత్రివేళ దోపిడీలు చేసేవారు. బుధవారం రాత్రి రూరల్ సీఐ రామాపురం క్రాస్‌రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆంధ్రప్రాంతనుంచి కోదాడకు వస్తున్న ఆటోను ఆపి వివరాలు అడగగా వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా చేసిన నేరాలు ఒప్పుకున్నట్లు తెలిపారు.
మేహార్‌షిండే, ఎళ్లు షిండేలు గత సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమల్లి, కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో దోపిడి నేరం చేసి 40 రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చారని, వారి వద్ద నుంచి మూడు కత్తులు, సెల్‌ఫోన్, రూ.1500 నగదును స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ పోలీసుకు డీఎస్పీ అభినందించారు. సమావేశంలో రూరల్ ఎస్‌ఐ చరమందరాజు, ఏఎస్‌ఐ ఇమామ్, హెడ్‌కానిస్టేబుల్ బ్రహ్మం, రమేష్, సిబ్బంది ఉన్నారు.