17 నుంచి ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు

Inter exam fee payment from 17 - Sakshi

ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 24 వరకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఈనెల 17 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు, హాజరు మినహాయింపుతో పరీక్షలకు హాజరయ్యే వారు కూడా నిర్ణీత తేదీల్లో పరీక్ష ఫీజు చెల్లించాలని సూచిం చారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 24 వరకు ఫీజు చెల్లించొచ్చని వివరించారు. 

ఫీజు చెల్లింపు తేదీలు.. 
17–9–2018 నుంచి 24–10–2018: ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు 
25–10–2018 నుంచి 8–11–2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు 
9–11–2018 నుంచి 26–11–2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు 
27–11–2018 నుంచి 11–12–2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు 
12–12–2018 నుంచి 2–1–2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 
3–1–2019 నుంచి 21–1–2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 
22–1–2019 నుంచి 4–2–2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు 

ఫీజు వివరాలు.. 
జనరల్, వొకేషనల్‌ థియరీ పరీక్షల ఫీజు రూ.460 
థియరీ, ప్రాక్టికల్‌ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620 
బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు రూ.170 
బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120 
మ్యాథ్స్‌/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460 
హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,050 
ఇదివరకే పాసైన సైన్స్‌ గ్రూపుల వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,200 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top