వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థుల కోసం ఇన్‌స్పైర్ కార్యక్రమం నిర్వహించారు.
వరంగల్: వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థుల కోసం ఇన్‌స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇన్‌స్పైర్ కార్యక్రమంలో డీఈవో చంద్రమోహన్, అసోసియేషన్ నేత వెంకటేశ్వర్లు, రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.