గడువు పెరిగింది

immigrants workers are benefited by kuwait decision - Sakshi

ఏప్రిల్‌ 22కు పొడిగింపు

ఆమ్నెస్టీపై కువైట్‌ సర్కార్‌ నిర్ణయం

వలస జీవులకు ఊరట

కోరుట్ల : వలస జీవుల వెతలు గమనిం చిన కువైట్‌ ప్రభుత్వం ఎట్టకేలకు ఫిబ్రవరి 22తో ముగియనున్న ఆమ్నెస్టీ గ డువును ఏప్రిల్‌ 22 వరకు పొడిగించిం ది. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లానుంచి వెళ్లి కువైట్‌లో కలివెల్లి అయి ఇబ్బందులు పడుతున్న వలస జీవులకు ఊరట లభించింది. మరో రెండు నెలల గడువు ఉండడంతో అడ్డగోలు గా విమాన ఛార్జీలు పెట్టుకుని స్వదేశానికి రావాల్సిన అవస్థలు తప్పాయి. 

అప్పులు తీరక..
ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, సిరి సిల్ల ప్రాంతాల నుంచి సుమారు 5వేల మంది, పెద్దపల్లి, కరీంనగర్‌ పరిసరా ల నుంచి మరో 1500 మంది వరకు ఉపాధికోసం కువైట్‌కు వెళ్లారు. కంపె నీ వీసాలతో కువైట్‌ వెళ్లి అక్కడ కంపె నీల్లో వేతనాలు సరిగ్గా లేక స్వదేశంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదురైన క్రమంలో చాలామంది ఎక్కు వ వేతనాల కోసం ఇతర కంపెనీలకు మారి కలివెల్లి అయిన వారి సంఖ్య సుమారు 2500 వరకు ఉంటుందని అంచనా. వీరిలో చాలా మంది కువైట్‌ ప్రభుత్వం ప్రకటించిన అమ్నేస్టీని వినియోగించుకుని స్వదేశం చేరేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. కువైట్‌ రావడానికి చేసిన అప్పులు తీర్చి ఎంతో కొంత డబ్బు కూడబెట్టకుండా ఇంటికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో కువైట్‌లో కలివెల్లి అయిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారిలో సుమారు 980 మంది మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. 

కాసుల్లేక..చార్జీలు పెరిగి
కువైట్‌ మొదట ప్రకటించిన అమ్నేస్టీ గడువు వినియోగించుకోవడంపై అవగాహన లేని వలసజీవులు చివరి రోజు ల్లో హడావుడి పడడం సమస్యాత్మకంగా మారింది. చాలామంది వలస జీవులు విమాన చార్జీలు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ఆశించి ఎదురుచూసినట్లు సమాచారం. ఫిబ్రవరి 22 దగ్గర పడడంతో తప్పనిసరై తమకు తాముగా స్వదేశాలకు వెళ్లేందుకు  సిద్దమయ్యారు. ఈక్రమంలో రద్దీ పెరిగిం ది. పదిరోజులుగా కువైట్‌ విమాన కంపెనీలు అకస్మాత్తుగా చార్జీలు పెం చేశాయి. ఒక్కో టికెట్‌కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు చేరింది. చేతిలో డబ్బులు లేక చేయడానికి పనులు లేక స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చాలా మంది వలస జీవులు అవస్థలు పడ్డా రు. ఓ దశలో ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునే ప్రయత్నాలు చేశారు. 

ఊరట దక్కింది..
ఈ పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా నుంచి కాంగ్రెస్‌ నాయకులు జేఎన్‌. వెంకట్, తెలంగాణ జాగృతి నాయకులు నవీన్‌ ఆచారీలు కువైట్‌ నుంచి తిరిగి వచ్చేవారికి విమాన చార్జీలు భరించడానికి ముందుకు రావడం బాధితులకు కొంత ఊరట నిచ్చింది. సుమారు 100–150 మంది వరకు కువైట్‌ నుం చి తిరిగి వచ్చినట్లు సమాచారం. కొం తమంది స్వయంగా డబ్బులు పెట్టుకుని వాపస్‌ వచ్చారు. ఇప్పటి వరకు వాపస్‌ వచ్చిన వారి సంఖ్యను మినహాయించినా మరో 800 మంది వరకు కువైట్‌లోనే ఉన్నట్లుగా సమాచారం. కువైట్‌ ప్రభుత్వం మళ్లీ అమ్నెస్టీ గడువును ఏప్రిల్‌ 22 వరకు పెంచడంతో వీరందరికి ఊరట కలిగింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top