హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకున్నా | i have stopped hyderabad becoming union territory | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకున్నా

Sep 15 2014 2:18 PM | Updated on Sep 27 2018 5:59 PM

హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకున్నా - Sakshi

హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకున్నా

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కేంద్ర మంత్రివర్గంలో అడ్డుకున్నది తానేనని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కేంద్ర మంత్రివర్గంలో అడ్డుకున్నది తానేనని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో ఏడాది తర్వాత ఎన్నికలు పెడితే గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని, రాబోయే రోజుల్లో బీజేపీతో ఇక్కడ టీఆర్ఎస్ జత కడుతుందని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే కాంగ్రెస్ నేతలు సెటిలర్లకు అండగా నిలవాలని ఆయన నాయకులకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement