పదవుల కోసం పాకులాడను

I Dont Try For Party Positions Said By Jupally Krishna Rao - Sakshi

సాక్షి, కొల్లాపూర్‌: పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన నిఖార్సైన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడినని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తాను పార్టీ వీడి ఇతర పార్టీలో చేరుతున్నట్లు ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పోస్టింగ్‌లు పెట్టిన నాగరాజు ముచ్చర్లతో పాటు, మూలె కేశవులు అనే వ్యక్తిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తానన్నారు. మితిమీరి ప్రవర్తించే వారికి తగిన బుద్ది చెబుతామన్నారు. తాను కారు గుర్తు ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నానని వెల్లడించారు.

ఉద్యమ సమయంలో, అభివృద్ధి అంశాల్లో  ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నానని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా కొనసాగానే తప్పా అధికారం కోసం పార్టీ మారలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం, కేసీఆర్‌కు చేదోడుగా ఉండాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌లో చేరానని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానన్నారు. సమావేశంలో ఎంపీపీ కమలేశ్వర్‌రావు, నాయకులు మేకల నాగరాజు, పసుపుల నర్సింహ్మ, నరసింహ్మారావు, ఎక్బాల్‌ తదితరులున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top